గురువారం 28 మే 2020
International - Apr 28, 2020 , 11:37:36

బ్రిక్స్ స‌మావేశాల‌కు విదేశాంగ‌మంత్రి

బ్రిక్స్ స‌మావేశాల‌కు విదేశాంగ‌మంత్రి

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా సంక్షోభంపై చ‌ర్చించేందుకు బ్రిక్స్ కూట‌మి మంగ‌ళ‌వారం స‌మావేశం కానుంది. బ్రెజిల్‌, ర‌ష్యా, ఇండియా, చైనా, ద‌క్షిణాఫ్రికా స‌భ్యులుగా ఉన్న ఈ కూట‌మి విదేశాంగ‌మంత్రులు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశాల్లో భార‌త విదేశాంగ‌మంత్రి ఎస్ జైశంక‌ర్ పాల్గొన‌నున్నారు. ర‌ష్యా అధ్య‌క్ష‌త‌న జ‌రుగ‌నున్న ఈ స‌మావేశ‌ల్లో క‌రోనా కార‌ణంగా సంక్షోభాన్ని అధిగ‌మించే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. క‌రోనా ఇంత ప్ర‌మాద‌కరంగా విజృంభించ‌టానికి చైనాయే కార‌ణ‌మ‌ని అగ్ర‌రాజ్యం అమెరికా మండిప‌డుతున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ సంబంధాల‌పై కోవిడ్‌-19 వైర‌స్ ప్ర‌భావం గురించి కూడా ఈ స‌మావేశాల్లో చ‌ర్చ జ‌రుగనుంది. 


logo