మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 13:58:04

వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో 75వ యూఎన్ అసెంబ్లీ స‌మావేశాలు..

వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో 75వ యూఎన్ అసెంబ్లీ స‌మావేశాలు..

హైద‌రాబాద్ : సెప్టెంబ‌ర్ 15వ తేదీన ప్రారంభం కావాల్సిన 75వ ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాలు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో యూఎన్ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ సారి స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం లేదు. అయితే ఆ స‌మావేశాల్లో ప్ర‌పంచ‌దేశాల అధినేత‌ల సందేశాల‌ను వీడియోల రూపంలో ప్లే చేయ‌నున్నారు. 75 ఏళ్ల యూఎన్ చ‌రిత్ర‌లో వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది. క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో.. స‌మావేశాల‌కు ప్ర‌త్య‌క్షంగా నేత‌లెవ్వ‌రూ హాజ‌రుకావ‌డంలేదు. జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాలు సాధార‌ణంగా వారం రోజుల పాటు జ‌రుగుతాయి. ప్రీ రికార్డు చేసిన వీడియో సందేశాల‌ను ప్లే చేయాల‌ని యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ నిర్ణ‌యించింది. ఆ వీడియో రికార్డు స‌మ‌యం 15 నిమిషాలు దాట‌కూడ‌ద‌ని ఫిక్స్ చేశారు. సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి ప్ర‌త్యేక 75వ వార్షిక స‌ద‌స్సు జ‌రుగుతుంది.logo