గురువారం 28 మే 2020
International - Apr 18, 2020 , 16:18:09

దక్షిణ కొరియాలో 20 లోపే కరోనా కేసులు..

దక్షిణ కొరియాలో 20 లోపే కరోనా కేసులు..

సియోల్‌: దక్షిణకొరియాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. దేశవ్యాప్తంగా ఈ రోజు 18 కేసులు మాత్రమే నయోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత తక్కువ కేసులు నమోదవడం రెండు నెలల్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. గత ఐదు రోజులుగా 30 చొప్పున కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దక్షిణ కొరియాలో మొదటి కరోనా కేసు ఫిబ్రవరి 20న వెలుగులోకివచ్చింది. అది మొదలు క్రమంగా కేసుల సంఖ్య మూడంకెలకు చేరింది. ఫిబ్రవరి 29 నాటికి అది 909కి చేరింది. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అది తగ్గుతూ వస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 10,653 మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌లుగా తేలారు. ఈ మహమ్మారి వల్ల 232 మంది మరణించారు. 7937 మంది పూర్తిగా కోలుకుని క్వారంటైన్‌ సెంటర్ల నుంచి విడుదలయ్యారు.


logo