గురువారం 28 మే 2020
International - Apr 07, 2020 , 09:58:55

క‌రోనాతో ఫుట్ బాల్ క్ల‌బ్ మేనేజ‌ర్ త‌ల్లి మృతి

క‌రోనాతో ఫుట్ బాల్ క్ల‌బ్ మేనేజ‌ర్ త‌ల్లి మృతి

బార్సెలోనా: స‌్పెయిన్ మాజీ ఫుట్ బాల్ ప్లేయ‌ర్, మాంచెస్ట‌ర్ సిటీ మేనేజ‌ర్ పెప్ గార్డియోలా త‌ల్లి క‌రోనా తో మృతి చెందింది. పెప్ గార్డియోలా (82)త‌ల్లి డాల‌ర్స్ సాలా క‌ర్రియో బార్సెలోనా సిటీలోని మ‌న‌రెసాలో తుదిశ్వాస విడిచిన‌ట్లు ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ తో ప్ర‌తీ ఒక్క‌రికి మంచి అనుబంధం ఉంది.

పెప్ గార్డియోలా త‌ల్లి మ‌ర‌ణించ‌డం విషాద‌క‌రం. పెప్ కు, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్న‌ట్లు మాంచెస్ట‌ర్ సిటీ క్ల‌బ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పెప్ గార్డియోలా 2016లో మాంచెస్ట‌ర్ సిటీ క్ల‌బ్ లో కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గ‌తంలో ఇత‌డు బార్సెలోనా, బేయ‌ర్న్ మ్యునిచ్ లో కోచ్ గా ప‌నిచేశాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo