సోమవారం 01 జూన్ 2020
International - Apr 29, 2020 , 14:30:34

ముందు మీ దేశాన్ని చూసుకోండి

ముందు మీ దేశాన్ని చూసుకోండి

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో అమెరికా, చైనా నావికాద‌ళాల మ‌ధ్య మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌పంచ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతున్న త‌రుణంలో చైనా ద‌క్షిణ చైనా స‌ముద్రంలో వ్యూహాత్మ‌కంగా అనేక వివాదాస్ప‌ద కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.దాంతో అమెరికా త‌న యుద్ధ‌నౌక యూఎస్స్ బేరీని అక్క‌డికి పంపింది. ఆ నౌక చైనా ఆధీనంలోని పారాసెల్ దీవుల స‌మీపానికి చేర‌టంతో చైనా నౌకాద‌ళం దానిని అడ్డ‌గించి వెన‌క్కు పంపింది. ఈ సంద‌ర్భంగా చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ అమెరికాపై మండిప‌డింది. క‌రోనాతో అమెరికాలో వేలమంది మ‌ర‌ణిస్తుండ‌టంతో ముందు సొంత దేశాన్ని చ‌క్క‌బెట్టుకోవాల‌ని సూచించింది. పారాసెల్ దీవుల‌పై ఆధిప‌త్యంకోసం చైనా, వియత్నాం, తైవాన్ మ‌ధ్య వివాదం ఉంది. గ‌త కొద్ది రోజులుగా చైనా ఈ దీవుల్లో అనుమానాస్ప‌ద కార్య‌క‌లాపాల‌ను పెంచింది.  ‌


logo