సోమవారం 25 మే 2020
International - Apr 06, 2020 , 18:28:16

గాల్లోకి ఎగురుతున్న ఈ కుక్క‌పిల్ల‌ను చూశారా..? వీడియో

గాల్లోకి ఎగురుతున్న ఈ కుక్క‌పిల్ల‌ను చూశారా..? వీడియో

సాధార‌ణంగా టీవీ షోలు, మ్యాజిక్ షోలు, కార్టూన్ షోల‌లో మ‌నుషులు, బొమ్మలు గాల్లోకి ఎగర‌డం చూస్తుంటాం. కానీ ఓ కుక్క పిల్ల అలా గాల్లోకి ఎగిరిపోతుంటే ఎలా ఉంటుంది..? విన‌డానికి, చూడటానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ మ‌హిళ చాలా క్రియేటివ్‌గా ఆలోచించి ఓ టిక్ టాక్ వీడియో చేసింది. త‌ను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క పిల్ల‌ను మ‌హిళ  అందంగా ముస్తాబు చేసింది. పెట్ క‌ళ్ల‌కు స్టైలిష్ గాగుల్స్ పెట్టింది.

వివిధ రంగుల్లో ఉన్న హీలియం బెలూన్ల‌కు దారం క‌ట్టి ఒక చోట ముడివేసింది. ఆ బెలూన్ల‌న్నింటిని క‌లిపి ఉన్న రోప్‌ను కుక్క‌పిల్ల వీపు నుంచి పొట్ట భాగం వ‌ర‌కు చుట్టింది. అప్ప‌టివ‌ర‌కు కుక్క‌పిల్ల‌ను చేతుతో ప‌ట్టుకున్న మ‌హిళ..  ఒక్క‌సారిగా చేతులు విడిచిపెట్టింది. ఇంకేముంది ఆ కుక్క‌పిల్ల నెమ్మ‌దిగా గాల్లోకి ఎగ‌ర‌డం షురూ అయింది. ఓ వైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్...మ‌రోవైపు పెట్ట గాల్లోకి వెళ్తున్న‌పుడు తీసిన టిక్‌టాక్ వీడియో ఆన్‌లైన్ లో వైర‌ల్ అవుతోంది. టిక్ టాక్ లో షేర్ చేసిన వెంట‌నే ఈ వీడియోకు 19 మిలియ‌న్ల వ్యూస్‌తోపాటు 3 మిలియ‌న్ల లైక్స్ వ‌చ్చాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మ‌రీ..!


@peterdapoodle

Had to repost this with a different, more fitting song ##dogsoftiktok ##viral

♬ Up Theme Song - Michael Giacchino

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo