సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 15:45:41

ఇది ఆకాశంలో ఎగిరే బెడ్‌రూం..!

ఇది ఆకాశంలో ఎగిరే బెడ్‌రూం..!

ఇస్తాంబుల్‌: ఆకాశంలో ఎగిరే బెడ్‌రూం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి ఆకాశంలో ఎగిరే మంచంపై అలారం సెట్‌ చేసుకుని మరీ దర్జాగా పడుకుని ప్రయాణించాడు. పక్కకు బెడ్‌లైట్‌.. టీవీ.. ఇలా మొత్తం బెడ్‌రూప్‌ సెటప్‌ అంతా గాల్లో వెళ్తుంటే అంతా ఆశ్చర్యంగా చూశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. 

టర్కీకి చెందిన హసన్ కావల్ ఈ ఫీట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పారాగ్లైడర్‌కు బెడ్‌లాంటి సోఫాసెట్‌ను తగిలించి, ఆకాశంలో దానిపై పడుకుని ప్రయాణించాడు. అంతకంటే ముందు అలారం సెట్‌ చేసుకున్నాడు. కళ్లకు స్లీప్‌ మాస్క్‌ పెట్టుకుని మరీ రిలాక్స్‌గా నిద్రపోయాడు. ఆ ఫ్లయింగ్‌బెడ్‌ అలా సముద్రంపై ప్రయాణించి,  బీచ్‌లో దిగింది. ఆకాశంలో పడుకుని ప్రయాణిస్తుంటే స్వర్గంలా అనిపించిందని కావల్‌ వెల్లడించాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టగా, పెద్ద సంఖ్యలో వీక్షించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo