ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 14:01:30

కరోనావైరస్ సహాయ నిధిని అవ‌స‌రాల‌కోసం వాడుకున్న వ్య‌క్తి.. కేసు న‌మోదు!

కరోనావైరస్ సహాయ నిధిని అవ‌స‌రాల‌కోసం వాడుకున్న వ్య‌క్తి.. కేసు న‌మోదు!

క‌రోనా నేప‌థ్యంలో పేద ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అధికారులు, చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ఉన్నోళ్లు లేనోళ్ల‌కు సాయం చేస్తున్నారు. కొంత‌మంది నిధులు సేక‌రించి పిపిఈ కిట్లు అంద‌జేస్తున్నారు. అయితే డేవిడ్ హైన్స్ అనేక కంపెనీల తరపున సుమారు 13.5 మిలియన్ డాలర్ల పిపిపి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్లోరిడాలోని అమన్ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం (పిపిపి) నుంచి దాదాపు 4 మిలియన్ డాలర్ల రుణాలను అందుకున్నాడు. వీటిని క‌రోనా బాధితుల‌కు ఇవ్వ‌కుండా త‌న సొంత అవ‌స‌రాల‌కు వాడుకున్నాడు.

లంబోర్గిని స్పోర్ట్స్ కారుతో స‌హా ల‌గ్జ‌రీ వ‌స్తువులు కొన‌డానికి ఉప‌యోగించాడు. దీంతో అత‌నిపై కేసు న‌మోదు చేశార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. అత‌ని మోసం త‌ర్వాత మునుప‌టి నెల‌ల ఖాతా వివ‌రాల‌ను ధృవీక‌రించారు. "పిపిపి నిధులను స్వీకరించిన కొద్ది రోజుల్లోనే, హైన్స్ 2020 లంబోర్ఘిని హురాకాన్ స్పోర్ట్స్ కారును సుమారు 318,000 డాలర్లకు కొనుగోలు చేశారు. తన పేరు మీద కంపెనీ పేరు మీద సంయుక్తంగా నమోదు చేసుకున్నాడు" అని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ఏదైతేనేం క‌రోనా పేషంట్ల‌కోసం సేక‌రించిన నిధుల‌ను ఇలా వాడుకోవ‌డం అన్యాయం క‌దా. logo