గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 08:33:12

బంగ్లాదేశ్‌లో వ‌ర‌ద‌లు.. 54 మంది మృతి

బంగ్లాదేశ్‌లో వ‌ర‌ద‌లు.. 54 మంది మృతి

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశంలోని ప‌లు ప్రాంతాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపు గ్రామాల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. సుమారు 56 వేల మందిని ముంపు గ్రామాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వారికి ప్ర‌త్యేకంగా పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా జ‌రిగిన వివిధ ప్ర‌మాదాల్లో మొత్తం 54 మంది మృతిచెందిన‌ట్లు బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

బంగ్లాదేశ్‌లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు సృష్టించిన బీభ‌త్స‌రం కార‌ణంగా ప్ర‌భావిత‌మైన వారి సంఖ్య 24 ల‌క్ష‌లు దాటింద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. బంగ్లాదేశ్ వరద బాధితులను ఆదుకోవ‌డానికి ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2 మిలియన్ల అమెరిన్ డాల‌ర్లు ఇచ్చిన‌ట్లు ఆ సంస్థ అధికార ప్ర‌తినిధి స్టెఫాన్‌ డుజారిక్ చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌లో మ‌రో 10 రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని, వ‌ర‌ద‌ల ప్ర‌భావం కూడా మ‌రింత పెరుగుతుందని అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo