మంగళవారం 19 జనవరి 2021
International - Dec 13, 2020 , 15:53:18

తలకిందులుగా సన్‌గ్లాసెస్‌..! ధర ఎంతంటే?

తలకిందులుగా సన్‌గ్లాసెస్‌..! ధర ఎంతంటే?

ఇటలీ: ఇటలీకి చెందిన లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గుస్సీ గమ్మ త్తైన సన్‌గ్లాసెస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఇన్‌వర్టెడ్‌ క్యాట్‌ ఐ’ గ్లాసెస్‌గా పిలిచే వీటి ధర ఎంతో తెలుసా? 470 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.45,800 అన్నమాట. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకరోజు ఉచిత హోండెలివరీని కూడా అందించింది గుస్సీ కంపెనీ. అయితే, ఈ కళ్లజోళ్లు సాధారణ సన్‌గ్లాసెస్‌కు భిన్నంగా ఉండడంతో వీటిపై వినియోగదారులు, దుకాణాదారులు ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

ఈ సన్‌గ్లాసెస్‌ను 50 లేదా 60వ దశకంలోవాడిన క్యాట్‌ ఐ ఫ్రేమ్‌లను తలకిందులు చేసి తయారు చేశారు. నలుపు, తెలుపు పట్టీలపై ఎనామిల్డ్‌ పూలను ముద్రించారు. దీనిపై చిన్నసైజులో గుస్సీ లోగో ఉంది. ప్రముఖ  రచయిత్రి పోరోచిస్టా ఖాక్‌పూర్ ఈ సన్‌గ్లాసెస్ పెట్టుకుని దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘గుస్సీ మనమెందుకు ఇలా చేస్తున్నాం’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. 1.3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 8,900 రీట్వీట్లను అందుకుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.