గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 22:26:03

టర్కీలో విమాన ప్రమాదం.. గాయపడిన ప్రయాణికులు

టర్కీలో విమాన ప్రమాదం.. గాయపడిన ప్రయాణికులు

ఇస్తాంబుల్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌ లో గల సబిహా గోక్సెన్ విమానాశ్రయం రన్‌వేపై ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్‌ అయ్యే సమయంలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం.. రెండుగా ముక్కలైంది. విమానంలో 177 మంది ప్రయాణికులు ఉండగా, ఎవరి ప్రాణాలకు హాని లేదని భద్రతా సిబ్బంది తెలుపగా, పలువురు గాయాలపాలైనట్లు చెప్పారు. వారిని భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైన ఫ్లైట్‌ పెగాసన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. కాగా, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఉరుములతో కూడిన గాలులు వీచినట్లు స్థానికులు తెలిపారు. విమానం  ప్రమాదానికి గురైన పరిస్థితి చూస్తే, ప్రయాణికులు ఘోరంగా గాయపడినట్లు తెలుస్తోంది.


logo
>>>>>>