మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 14:59:45

క‌రోనా పాజిటివ్ తేలిన ప్ర‌పంచాధినేత‌లు వీళ్లే..

క‌రోనా పాజిటివ్ తేలిన ప్ర‌పంచాధినేత‌లు వీళ్లే..

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు  క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన విష‌యం తెలిసిందే. అయితే ట్రంప్ క‌న్నా ముందు ప‌లువురు దేశాధినేత‌ల‌కు వైర‌స్ సోకింది.  ఆ జాబితాలో బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ముందున్నారు.   యూకే ప్ర‌ధాని మూడు వారాల పాటు ఏప్రిల్ నెల‌లో ఇంటెన్సివ్ కేర్‌లో గ‌డిపారు.  అయితు అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న‌ట్లు ఆయ‌న ఆ త‌ర్వాత‌ వెల్ల‌డించారు.  హోండుర‌స్ అధ్య‌క్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండేజ్‌కి కూడా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  జూన్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని టీవీ సందేశం ద్వారా వెల్ల‌డించారు.  త‌న‌కు, త‌న భార్య‌తో పాటు ఇత‌ర సిబ్బందికి కూడా వైర‌స్ సోకిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  

క‌రోనా సంక్ర‌మించిన వారిలో బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బోల్స‌నారో కూడా ఉన్నారు.  జూలైలో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు.  అంత‌కుముందు ఆయ‌న మూడుసార్లు ప‌రీక్ష చేయించుకుంటే వాటిలో నెగ‌టివ్ వ‌చ్చింది.  ఇదో చిన్న‌పాటి ఫ్లూ అంటూ ప‌లుమార్లు జెయిర్ బొల్స‌నారో క‌రోనాపై కామెంట్ చేశారు.  గ్వాటెమాల అధ్య‌క్షుడు అలెగ్జాండ్రో గిమ్మాటీకి కూడా వైర‌స్ సోకింది.  సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు.  ఆరుసార్లు ఆయ‌న క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు.  చాలా స్వ‌ల్ప స్థాయిలో ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  వ‌ళ్లు నొప్పులు, ద‌గ్గు వ‌చ్చిన‌ట్లు అలెగ్జాండ్రో తెలిపారు.  


logo