శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 19:00:46

చైనాలో హోటల్‌ భవనం కుప్పకూలి ఐదుగురు మృతి

చైనాలో హోటల్‌ భవనం కుప్పకూలి ఐదుగురు మృతి

బీజింగ్‌ : చైనాలోని ఉత్తర షాంక్సీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్‌ భవనం కుప్పకూలి ఐదుగురు మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ (సీసీటీవీ) తెలిపింది. షాంక్సీ ప్రావిన్స్ లిన్ఫెన్ పట్టణ జిల్లాలో రెండంస్తుల హోటల్‌ భవనం శనివారం ఉదయం 10 గంటల సమయంలో కూలిపోయింది. భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. చైనా పీపుల్స్ ఆర్డ్మ్‌ పోలీస్ పారామిలిటరీ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న 37 మందిలో 33 మందిని రక్షించారు. ఐదుగురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo