శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 20:12:49

చేపలు రంగులు మార్చుకుంటాయి ... పరిశోధనలో వెల్లడైన కొత్త కోణం

చేపలు రంగులు మార్చుకుంటాయి ... పరిశోధనలో వెల్లడైన కొత్త కోణం

వాషింగ్టన్: సముద్రం లోపలి భాగంలో నివసించే పలు చేపల జీవన రహస్యాన్ని సైన్టిస్టులు చేధించారు.16 రకాల చేపల చర్మం పై ( వర్ణకాలు ) రంగులు మార్చుకునే గుణాన్ని కలిగి ఉన్నట్లు తేల్చారు. అవి విశ్వం లోనే అతి నల్లని పదార్థాలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేపలు ఇతర  జంతువులు వేటాడే సమయంలో వాటికి కనిపించకుండా ఉండేందుకు తమ చర్మం పై ఈ నల్లని పదార్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అధ్యయనాన్ని" కరెంట్ బయాలజీ "అనే సైన్స్ జర్నల్‌ గురువారం ప్రచురించింది.

స్మిత్ సోనియన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో జువాలజిస్ట్ గా పనిచేస్తున్న కరెన్ ఒస్బోర్న్ వీటిపై ప్రత్యేకంగా పరిశోధన చేసింది. ఆ పదార్ధం కాంతిలో .5 శాతం కన్నా తక్కువగా ప్రతిబింబింస్తున్నదని నిర్థారించింది. ఆయా చేపల చర్మం పై ఉన్న తెరను గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆమె ఫొటోలు తీయాలని చూసింది. కానీ ఆ ఫొటోలు తీయలేకపోయింది. టెలిస్కోపులు, కెమెరాలు ఇతర పరికరాలకు కనిపించకుండా ఉండేందుకు ఆయా చేపల పై ఉండే పొర అడ్డుకొంటున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. 


logo