బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:15

తిరుగులేని ఐన్‌స్టీన్‌!

తిరుగులేని ఐన్‌స్టీన్‌!

  • సాపేక్ష సిద్ధాంతం ముమ్మాటికీ నిజమే

లండన్‌: విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ దాదాపు వందేండ్ల క్రితం ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం సరైనదేనని మరోసారి నిరూపితమైంది. తాజాగా జరిగిన ఓ ఖగోళ పరిశోధనలో 500 రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ సిద్ధాంతాన్ని అబద్ధమని నిరూపించలేకపోయారు. భూమికి 5.4 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న భారీ కృష్ణ బిలంపై 2009 - 2017వరకు అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. సాధారణంగా ఒక ఖగోళ వస్తువు గురుత్వాకర్షణ శక్తి వల్ల విశ్వంలో దానికి సంబంధించిన ఖగోళ సమయం కొంచెం తగ్గుతుంది. అంటే గురుత్వ శక్తి వల్ల కాలం చక్రం కొంచం వంగి ప్రయాణిస్తుంది. దీనినే సాపేక్ష సిద్ధాంతంలో ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించారు. 


logo