శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 08, 2020 , 12:19:10

శుక్ర‌వారం చంద్ర‌గ్ర‌హ‌ణం

శుక్ర‌వారం చంద్ర‌గ్ర‌హ‌ణం

హైద‌రాబాద్‌: జ‌న‌వ‌రి 10వ తేదీన చంద్ర‌గ్ర‌హ‌ణం. ఈ ఏడాదిలో ఇదే తొలి చంద్ర‌గ్ర‌హ‌ణం కానున్న‌ది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 26వ తేదీన సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డిన‌ విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం జ‌రిగే చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని భార‌త్ నుంచి వీక్షించ‌వ‌చ్చు. పున్న‌మి రోజున ఏర్ప‌డే ఈ గ్ర‌హ‌ణాన్ని.. వోల్ఫ్ మూన్ ఎక్లిప్స్ అంటారు. సుమారు 4 గంట‌ల పాటు గ్ర‌హ‌ణం ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 10వ తేదీ రాత్రి 10.39 నిమిషాల‌కు గ్ర‌హ‌ణం ప్రారంభ‌మై ఆ త‌ర్వాత శ‌నివారం తెల్ల‌వారుజామున 2.40 నిమిషాల‌కు ముగుస్తుంది. యూరోప్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి కూడా ఈ చంద్ర గ్ర‌హ‌ణాన్ని వీక్షించ‌వ‌చ్చు. 2020లో మొత్తం నాలుగు సార్లు చంద్ర‌గ్ర‌హ‌ణం ఉంటుంది. రెండ‌వ‌ది జూన్ 5న‌, మూడ‌వ‌ది జూలై 4న‌, నాలుగ‌వ‌ది న‌వంబ‌ర్ 29వ తేదీన ఉంటుంది. ఇక ఈ ఏడాది రెండు సూర్య గ్ర‌హ‌ణాలు ఉన్నాయి. తొలి సూర్య గ్ర‌హ‌ణం జూన్ 21వ తేదీన‌, రెండ‌వ సారి డిసెంబ‌ర్ 14న ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.


logo