గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 16:11:03

వంద రోజుల త‌ర్వాత న్యూజిలాండ్‌లో క‌రోనా కేసులు

వంద రోజుల త‌ర్వాత న్యూజిలాండ్‌లో క‌రోనా కేసులు

హైదరాబాద్: న్యూజిలాండ్‌లో కొత్త‌గా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. దాదాపు 100 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ వైర‌స్ ఛాయ‌లు క‌నిపించాయి.  ఒకే ఇంటికి చెందిన న‌లుగురికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. అయితే వైర‌స్ ఎలా సంక్ర‌మించిందో ఇంకా తెలియ‌లేద‌ని ఆమె చెప్పారు.  వైర‌స్ నియంత్రణ కోసం ఆక్లాండ్‌లో లెవ‌ల్ త్రీ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.  మ‌రో వైపు కోవిడ్ టెస్టింగ్‌పై  ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెంచేందుకు న్యూజిలాండ్ హెల్త్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ఆష్లే జాతీయ టీవీ ఛాన‌ల్‌లో లైవ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.   ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు. న్యూజిలాండ్ క‌రోనా కేసుల‌ను ప‌క‌డ్బందీగా క‌ట్ట‌డి చేసింది. వంద రోజుల నుంచి అక్క‌డ కేసులు న‌మోదు కాలేదు.   logo