గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 10:09:36

హుబేయ్ ప్రావిన్సులో తెరుచుకున్న స్కూళ్లు..

హుబేయ్ ప్రావిన్సులో తెరుచుకున్న స్కూళ్లు..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాలోని హుబేయ్ ప్రావిన్సులో నేటి  నుంచి స్కూళ్ల‌ను ఓపెన్ చేశారు.  గ్రేడ్ 12, 9 విద్యార్థుల‌కు స‌మ్మ‌ర్‌లో ప‌రీక్ష‌ల స‌మ‌యం ఆస‌న్న‌మైంది. దేశ‌వ్యాప్తంగా మార్చి నెల‌లోనే 12వ గ్రేడ్ విద్యార్థుల‌కు స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. ఆ ప్రావిన్సులో స్కూళ్ల‌కు వెళ్లే పిల్ల‌లు అంద‌రూ క‌రోనా పరీక్ష‌లు చేయించుకోవాలి. సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి నిబంధ‌న‌లు కూడా స్కూల్‌లో పాటించాలి. హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్‌లోనే గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో క‌రోనా వైర‌స్ కేసులు తొలుత బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే.అయితే గ‌త 32 రోజుల నుంచి అక్క‌డ కొత్త కేసులు లేవు. దేశ‌వ్యాప్తంగా చైనాలో ఇవాళ కొత్త రెండు కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 82, 883గా ఉన్న‌ది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 4633గా ఉంది. logo