బుధవారం 03 జూన్ 2020
International - May 07, 2020 , 01:16:11

పాక్‌ వాయుసేనలో తొలిసారి హిందువుకు అవకాశం

పాక్‌ వాయుసేనలో తొలిసారి హిందువుకు అవకాశం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ వాయుసేన (పీఏఎఫ్‌)లో తొలిసారి ఒక హిందూ యువకుడు చేరాడు. సింధు రాష్ట్రంలోని థర్పర్కర్‌ జిల్లాకు చెందిన రాహుల్‌ దేవ్‌ను జనరల్‌ డ్యూటీ పైలట్‌ ఆఫీసర్‌గా నియమించినట్లు పీఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. కాగా, మైనార్టీ వర్గానికి చెందిన ఓ హిందూ యువకుడు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పాకిస్థాన్‌ రేడియో బుధవారం పేర్కొంది. మతపరమైన సరిహద్దులను పీఏఎఫ్‌ చేరిపేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌' ఓ కథనాన్ని ప్రచురించింది.


logo