శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 03:34:50

మొదట జ్వరం.. తర్వాత దగ్గు

మొదట జ్వరం.. తర్వాత దగ్గు

లాస్‌ ఏంజెలెస్‌: కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్నది. మరో వైపు ఇది సీజనల్‌ వ్యాధుల సమయం. జ్వరం వస్తే ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన అధ్యయనాన్ని వెల్లడించారు. కరోనా సోకినప్పుడు మొదట ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. తర్వాత క్రమంగా ఎలాంటి లక్షణాలు బయటపడుతాయో అందులో పేర్కొన్నారు. వారి అధ్యయనం ప్రకారం కరోనా సోకిన వారిలో మొదట జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత దగ్గు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, డయేరియా లక్షణాలు వరుస క్రమంలో బయటపడుతాయి. ఈ సమాచారం కొవిడ్‌ చికిత్సలో, సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ పీటర్‌ కున్‌ తెలిపారు. 


logo