శుక్రవారం 10 జూలై 2020
International - Feb 15, 2020 , 17:53:43

యూరప్‌లో తొలి కరోనా మృతి కేసు

యూరప్‌లో తొలి కరోనా మృతి కేసు

చైనా పర్యాటకుడి మరణంతో యూరప్‌లో తొలి కరోనా వైరస్ మృతి కేసు నమోదైంది.

పారీస్‌:  యూరప్‌లో మొదటి కోవిద్‌-19 (కరోనావైరస్‌) మృతి కేసు నమోదైంది. ఫ్రాన్స్‌లో  80ఏండ్ల చైనా పర్యాటకుడు కరోనా కారణంగా మృతి చెందినట్లు ఫ్రాన్స్‌ ఆరోగ్యశాఖ మంత్రి అగ్నెస్‌ బుజిన్‌ తెలిపారు. మృతుడు చైనాలోని హుబెయ్‌ ఫ్రావిన్స్‌కు చెందిన వృద్ధుడిగా గుర్తించారు.  వ్యాధి సోకిన వ్యక్తి జనవరి 16న ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చాడు. వ్యాధి లక్షణాలు బయటపడటంతో పారీస్‌లోని ఓ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో జనవరి 25న  చేరాడు.  చైనా ఆవల ఇప్పటి వరకు కేవలం మూడు దేశాలు హాంకాంగ్‌,  ఫిలీప్పీన్స్‌, జపాన్‌లో మాత్రమే కరోనా మృతి కేసులు నమోదయ్యాయి. చైనా పర్యాటకుడి  మరణంతో యూరప్‌లో తొలి కరోనా వైరస్  మృతి కేసు నమోదైంది.  చైనాలో వ్యాధి తీవ్రత రోజురోజుకీ తీవ్రమవుతోంది.  ఇప్పటి వరకు ఒక్క చైనాలోని కరోనా కారణంగా 1500 మంది  మరణించారు. మొత్తంగా 66,492 మంది వ్యాధి బారిన పడ్డట్లు చైనా అధికారులు తెలిపారు. 


logo