బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 00:38:53

తొలి రోగి గుర్తింపు

తొలి  రోగి గుర్తింపు

బీజింగ్‌/లండన్‌: కరోనా వైరస్‌ మొట్టమొదట ఎవరికి సోకిందన్న విషయం బయటపడింది. చైనాలోని వుహాన్‌లో ఉన్న హువనాన్‌ చేపల మార్కెట్‌లో ‘వ్యూ గ్యూజియాన్‌' (57) అనే మహిళకు తొలుత ఈ వైరస్‌ సోకింది. చేపలు విక్రయించే ఆమె గతేడాది డిసెంబర్‌ 10న తీవ్ర జలుబుతో బాధపడుతూ దవాఖానకు వెళ్లారు. పరీక్షించిన వైద్యులు సాధారణ జలుబుగా భావించి ఓ ఇంజక్షన్‌ ఇచ్చి పంపించారు. అయితే ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మరో దవా ఖానకు వెళ్లారు. అక్కడా తగ్గక పోవడంతో వుహాన్‌ దవాఖానకు వెళ్లగా ఆమె తీవ్రమైన జబ్బుతో బాధప డుతున్నట్లు వైద్యులు గుర్తించారు.  మ రి కొంతమంది ఇవే లక్షణాలతో రావ డంతో ఇదేదో మహమ్మారిగా ఉన్నదని వైద్యులు అప్రమత్తమయ్యారు. కాగా, నెల రోజుల తర్వాత గ్యూజియాన్‌ కోలుకున్నారు.


logo