ఆదివారం 31 మే 2020
International - Apr 06, 2020 , 08:28:00

క‌రేబియ‌న్ కంట్రీ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

క‌రేబియ‌న్ కంట్రీ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

హైతీ: క‌రేబియ‌న్ కంట్రీ హైతీలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. 55 ఏళ్ల వ్య‌క్తి క‌రోనా వైర‌స్ తో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని హైతీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. హైతీలో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 21 మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. అయితే కేసులు మాత్రం త‌క్కువున్నా..ఇంత త‌క్కువ కేసులుండ‌గానే ఓ వ్య‌క్తి చ‌నిపోవ‌డం అక్క‌డివారికి ఆందోళ‌న క‌లిగిస్తోంది.

10 మిలియ‌న్ల జ‌నాభా క‌లిగిన హైతీలో కేవ‌లం 124 ఐసీయూ బెడ్లు, 62 వెంటిలేట‌ర్లు ఎడ్యుకేస‌న్ కన్సార్టియ‌మ్ ఫ‌ర్ అక్యూట్ కేర్ 2019లో విడుద‌ల చేసిన ఓ నివేదిక‌లో పేర్కొంది. హైతీలో విద్యుత్ కొర‌త కూడా ఉంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo