శనివారం 30 మే 2020
International - Mar 29, 2020 , 19:02:47

ఫ‌స్ట్ క‌రోనా కేసు వుయ్ జూషాన్‌: తొలి బాధితురాలి గుర్తింపు

ఫ‌స్ట్ క‌రోనా కేసు వుయ్ జూషాన్‌: తొలి బాధితురాలి గుర్తింపు

ప్ర‌పంచాన్ని బెంబేలెత్తిస్తున్న క‌రోనా వైర‌స్ మొట్ట‌మొద‌టి పేషెంట్‌గా భావిస్తున్న ఫస్ట్ వ్య‌క్తిని ఎట్ట‌కేల‌కు గుర్తించారు.  ఆంగ్ల‌ప‌త్రిక వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ క‌రోనా ఫ‌స్ట్ కేసు  ఆచూకిని క‌నుగొన్నారు. అయితే చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌లో గల వుహాన్ సిటీలో ఈ వైరస్‌ పుట్టినిల్లు అనే విషయం తెలిసినప్పటికీ.. మొట్టమొదటిసారిగా ఆ వైరస్ ఎవరిలో ప్రవేశించిందనే విషయం ఇఫ్పటిదాకా వెలుగు చూడలేదు. మొదటిసారిగా ఈ వైరస్ బారిన ఎవరు పడ్డారనేది ఇన్నాళ్లూ అంతుచిక్కని ప్రశ్నలా ఉంటూ వచ్చింది. .అసలు విష‌య‌మేమిటంటే... ఈ తొలి పేషెంట్ జీవించే ఉన్నది. కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని ఇంకా జీవించే ఉన్న‌ది. వుహాన్‌లోని హున‌న్ స‌ముద్ర జీవుల మార్కెట్‌లో రొయ్య‌ల‌ను విక్ర‌యించే వుయ్ జూషాన్‌. ఆమె వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు.  మొద‌ట‌గా ఆమెను సోకిన క‌రోనానే ఇప్ప‌డు మ‌హ‌మ్మారిగా మారి 30వేల మందికి పైగా బ‌లి తీసుకుంది. 


logo