శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 01:06:04

అమెరికాలో తొలి రీఇన్ఫెక్షన్‌ కేసు

అమెరికాలో తొలి రీఇన్ఫెక్షన్‌ కేసు

రెనో, ఆగస్టు 29: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్‌ సోకుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. అమెరికాలోని నెవాడా రాష్ర్టానికి చెందిన పాతికేండ్ల యువకుడికి రెండోసారి వైరస్‌ సోకినట్టు అధికారులు పేర్కొన్నారు. అమెరికాలో తొలి రీఇన్ఫెక్షన్‌ కేసు (ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్‌ సోకడం) ఇదేనని భావిస్తున్నారు. సదరు యువకుడికి తొలిసారిగా ఏప్రిల్‌లో వైరస్‌ సోకగా, చికిత్స అనంతరం రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. జూన్‌లో అతడు రెండోసారి వైరస్‌ బారిన పడ్డాడు. అయితే, తొలిసారి కంటే రెండోసారి అతనిలో వైరస్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని.. మొదటిసారి సోకిన వైరస్‌తో పోల్చితే రెండోసారి సోకిన వైరస్‌ జన్యుక్రమం భిన్నంగా కూడా ఉన్నట్లు గుర్తించామని నెవాడా స్టేట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీ పరిశోధకులు తెలిపారు. న్యూమోనియా వ్యాధితో కూడా యువకుడు ఇబ్బంది పడ్డాడని, కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించినట్టు చెప్పారు. 


logo