ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 15:05:24

రెండు వారాల్లో రష్యా వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ విడుదల

రెండు వారాల్లో రష్యా వ్యాక్సిన్‌ మొదటి బ్యాచ్‌ విడుదల

మాస్కో: ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకా (స్పుత్నిక్‌ వీ)ని రిజిస్టర్‌ చేసిన రష్యా ఇందుకు సంబంధించిన మరో శుభవార్త తెలిపింది. ఈ టీకా మొదటి బ్యాచ్‌ రెండు వారాల్లో విడుదల కానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో బుధవారం వెల్లడించారు. ‘టీకా స్వచ్ఛందంగానే ఉంటుంది. కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఉన్న 20 శాతం మంది వైద్యులకు వ్యాక్సిన్‌ అవసరం లేదనుకుంటున్నాం. అది నిర్ణయించాల్సిన బాధ్యత కూడా వారికే వదిలేశాం.’అని పేర్కొన్నారు. 

మొదట రష్యా అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యతమిస్తామని మురాష్కో పేర్కొన్నారు. అలాగే, కొంతమేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తామన్నారు. అయితే, దేశీయ మార్కెట్‌ అవసరాలకే తమ మొదటి ప్రాధాన్యం అని నొక్కిచెప్పారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేసింది. స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 


logo