ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 13:45:46

పాంట‌నాల్ అడ‌వు‌ల్లో మూడింత‌లు పెరిగిన అగ్నిప్ర‌మాదాలు

పాంట‌నాల్ అడ‌వు‌ల్లో మూడింత‌లు పెరిగిన అగ్నిప్ర‌మాదాలు

రియోడి జెనీరో: ప‌్ర‌పంచంలో అతిపెద్ద న‌దుల్లో ఒక‌టైన అమెజాన్ న‌ది పాంట‌నాల్ చిత్త‌డి నేల‌ల్లో వ‌ంపులు తిరుగుతూ వ‌య్యారాలు పోతూ ప్ర‌వ‌హిస్తుంది. ఇక్క‌డ న‌దీ ప్ర‌వాహ దృష్యం విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. అయితే, పాంట‌నాల్‌లో ఉన్న అట‌వీ ప్రాంతంలో ఈ ఏడాది అగ్నిప్ర‌మాదాలు మూడింత‌లు పెరిగాయని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2019 ‌తో పోలిస్తే ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి జూలై 22 వ‌రకు 3506 అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించాయ‌ని బ్రెజిల్ నేష‌న‌ల్ స్పేస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. గ‌తేడాదితోపోలిస్తే ఇది 192 శాతం అధిక‌మ‌ని తెలిపింది. 1998 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని పేర్కొంది. 2019లో ఈ ప్రాంతంలో ఇప్ప‌టికే ఆరురెట్లు అగ్నిప్ర‌మాదాలు పెరిగాయి.  

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌కు ద‌క్షిణాన ఉన్న పాంట‌నాల్ బ్రెజిల్ నుంచి ప‌రాగ్వే, బోలీవియా వ‌ర‌కు విస్త‌రించి ఉంది. అపార జీవ‌సంప‌ద‌కు నిల‌య‌మైన ఈ ప్రాంతం 2020లో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన అగ్నిప్ర‌మాదాల‌తో దెబ్బ‌తిన్న‌ది. గ‌త 13 ఏండ్ల‌లో ఎప్పుడూ లేనివిధంగా జూన్ నెల‌లో 2,248 అగ్నిప్ర‌మాదాలు జ‌రిగాయి.


logo