బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 02:06:46

కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లి కూలిన విమానం

కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లి కూలిన విమానం
  • ముగ్గురు అమెరికా వైమానిక సిబ్బంది మృతి
  • ఆస్ట్రేలియాలో ఘటన

సిడ్నీ, జనవరి 23: కార్చిచ్చును అదుపు చేసే ప్రయత్నంలో విమానం కూలిన ఘటనలో అమెరికాకు చెందిన ముగ్గురు వైమానిక సిబ్బంది మరణించారు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలో గత కొంత కాలంగా దావానలం వ్యాపిస్తున్నది. ఈ క్రమంలో మంటలను అదుపు చేసేందుకు సీ-130 హెర్క్యులస్ ప్రత్యేక విమానం వాటర్ ట్యాంకర్ నీటితో ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అయితే, మంటల్ని అదుపుచేసే క్రమంలో సదరు విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయినట్టు న్యూ సౌత్‌వేల్స్ రాష్ర్ట అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో అమెరికా వైమానిక సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు వాళ్లు తెలిపారు. అయితే, విమానం ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకూ తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.logo