శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 15:01:38

16వ అంత‌స్థులో అగ్నిప్ర‌మాదం.. కిటికీకి వేలాడుతున్న మ‌హిళ‌

16వ అంత‌స్థులో అగ్నిప్ర‌మాదం.. కిటికీకి వేలాడుతున్న మ‌హిళ‌

భ‌వ‌నంలోని 16వ అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అందులో ఓ మ‌హిళ చిక్కుకుపోయింది. బ‌య‌ట‌కు రావ‌డానికి వీలు లేక‌పోవ‌డంతో కిటికీ వ‌ద్ద వేలాడుతున్న‌ది. ఆమెను అగ్నిమాప‌క సిబ్బంది బృందం ర‌క్షించింది. న్యూయార్క్ న‌గ‌ర అగ్నిమాప‌క విభాగానికి నెటిజ‌న్లు ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

ఈ సంఘటన మాన్హాట్ట‌న్‌లో జరిగింది. అపార్ట్‌మెంట్‌లో మంట‌లు సంభ‌వించ‌డంతో వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి తెలియ‌జేశారు. వారు వ‌చ్చే స‌రికి మ‌హిళ కిటికీకి వేలాడుతున్న‌ది. ఆమెను కాపాడేందుకు సిబ్బంది 17వ అంత‌స్థు మీద‌కు వెళ్లి తాడు సాయంతో ఆమెను ర‌క్షించారు. ఈ వీడియోను పోలీసులు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. 


logo