గురువారం 28 మే 2020
International - May 12, 2020 , 14:17:31

వెంటిలేటర్ మంటలు.. ఐదుగురు కరోనా రోగులు మృతి

వెంటిలేటర్ మంటలు.. ఐదుగురు కరోనా రోగులు మృతి

హైదరాబాద్: రష్యాలో ఘోరం జరిగింది. ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్ నుంచి మంటలు వ్యాపించి ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని తెలిసింది. సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రమాదం జరిగిందని ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక వార్తల ద్వారా తెలిసింది. 150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించారు. గత శనివారం మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు. రష్యాలో కరోనా కేసులు సోమవారం నాటికి 2 లక్షల 21 వేలకు పెరిగాయి.


logo