బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 25, 2020 , 01:18:41

అమెరికాలో కాల్పులు

అమెరికాలో కాల్పులు
  • భారతీయుడు మృతి
  • లాస్‌ఏంజెల్స్‌లో ఘటన

వాషింగ్టన్‌: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మణిందర్‌సింగ్‌ సాహి (31) అనే భారతీయుడు మృతిచెందారు. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని విట్టియార్‌ నగరంలోని సెవెన్‌-ఎలెవన్‌ నిత్యవసరాల దుకాణంలో మణిందర్‌సింగ్‌ సాహి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 5.43 గంటల ముసుగు ధరించిన  ఆగంతకుడు తుపాకీతో దుకాణంలోకి ప్రవేశించాడు. కౌంటర్‌లోని డబ్బు ఇవ్వాలని మణిందర్‌ను బెదిరించడంతో.. ఆయన డబ్బు ఇచ్చేశాడు. అయితే పారిపోతూ మణిందర్‌పై కాల్పులకు తెగబడటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అక్కడే ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. మృతుడు హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందిన వాడు. భార్య, ఇద్దరు పిల్లలున్న మణిందర్‌.. ఆరునెలల కిందటే అమెరికాకు వచ్చినట్టు తెలుస్తున్నది. దుండగుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. 


logo
>>>>>>