శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 09, 2020 , 12:11:10

33 అంత‌స్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

33 అంత‌స్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వీడియో

హైద‌రాబాద్‌:  ద‌క్షిణ కొరియాలోని ఉల్సాన్ న‌గ‌రంలో ఉన్న 33 అంత‌స్తుల అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.  బిల్డింగ్‌లోని 12వ అంత‌స్తులో మంట‌లు వ్యాపించి.. 8వ ఫ్లోర్‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. అయితే భారీగా మంట‌లు ఎగిసిప‌డ‌డంతో కొంత మంది బిల్డింగ్ పైఅంత‌స్తుకు వెళ్లారు. ఈ ప్ర‌మాదంలో ఎంత మంది మ‌ర‌ణించార‌న్న విష‌యాన్ని ఇంకా వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతానికి మంట‌ల్ని ఆర్పేసిన‌ట్లు అధికారులు చెప్పారు.  గాలులు బ‌లంగా వీచ‌డం వ‌ల్ల మంట‌లు అతిత్వ‌ర‌గా వ్యాపించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.  ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ 88 మందిని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు.  రాత్రి 11 గంట‌ల‌కు ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఉల్సాన్ న‌గ‌రంలో కోటి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న‌ది. సియోల్ స‌మీపంలో ఏప్రిల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో సుమారు 38 మంది మ‌ర‌ణించారు. 


logo