మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Jan 21, 2020 , 22:26:47

అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి

అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతి

రష్యాలో సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతిచెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో 10 మందిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించామని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిచులింస్కై సెటిల్‌మెంట్‌లోని ఓ ప్రైవేటు టింబర్‌ డిపోలో ఈ ప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగి అక్కడే కలపతో నిర్మించిన

మాస్కో : రష్యాలో సైబీరియా ప్రాంతంలోని టామ్స్‌కే పట్టణానికి మారుమూలన ఉన్న ఓ గ్రామంలోని టింబర్‌ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు మృతిచెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో 10 మందిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించామని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిచులింస్కై సెటిల్‌మెంట్‌లోని ఓ ప్రైవేటు టింబర్‌ డిపోలో ఈ ప్రమాదం జరిగిందని, మంటలు చెలరేగి అక్కడే కలపతో నిర్మించిన ఇంట్లో ఉంటున్న కూలీలు మృతిచెందారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ గవర్నర్‌ చెప్పారు. మధ్య ఆసియాకు చెందిన లక్షలమంది వలస కూలీలు రష్యాలో పనులు చేస్తూ జీవిస్తున్నారు.logo