గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 15:26:24

షార్జాలో భారీ అగ్నిప్రమాదం

షార్జాలో భారీ అగ్నిప్రమాదం

షార్జా: షార్జాలోని అల్‌నహ్‌డ్‌ ప్రాంతంలోని ఓ భవంతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 49 అంతస్థలున్న భవనంలోని పదో అంతస్థులో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో భవంతిలో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీపం దవాఖానకు తరలించారు. 

ఈ భవంనంలో దాదాపు 250 కుటుంబాలు నివసిస్తుండగా.. వీరిలో ఎక్కువ మంది భారతీయులేనని తెలుస్తున్నది. అగ్నమాపక సిబ్బంది దాదాపు 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఇంకనూ తెలియరాలేదు.


logo