మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 19:14:54

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఫిన్లాండ్‌ ప్రధాని పెళ్లి!

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఫిన్లాండ్‌ ప్రధాని పెళ్లి!

హెల్సింకి: ఆమె ఓ దేశ ప్రధాని. అయినా ఆమె పెళ్లిని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా జరుపుకుంది. తాను సహజీవనం చేస్తున్న ప్రియుడిని కేవలం 40 మంది అతిథుల సమక్షంలో వరించి, దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచింది. తన మ్యారేజ్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టింది.

సన్నా మారిన్‌(34).. ఈమె ఫిన్లాండ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌. అలాగే, ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళా ప్రధానమంత్రి. ఆమె సాకర్‌ క్రీడాకారుడైన మార్కస్‌ రైక్కోనెన్‌ను 18 ఏళ్ల వయస్సు నుంచి ప్రేమిస్తోంది. 16 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఎమ్మా అమాలియా మారిన్‌ కూడా ఉంది. అయితే, సన్నా మారిన్‌ తన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అదికూడా నిరాడంబరంగా. కొవిడ్‌ నేపథ్యంలో వివాహ వేడుక మారిన్ అధికారిక నివాసమైన కేసారెంట్ వద్ద జరిగింది. ఈ ఆత్మీయ కార్యక్రమానికి 40 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. కాగా, ఒక దేశ ప్రధాని సాదాసీదాగా పెళ్లి చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశాన్ని నడిపించేవారు మారిన్‌లా ఆదర్శంగా ఉండాలని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo