గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 20, 2020 , 18:08:59

మరోసారి ‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌

మరోసారి ‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌

హెల్‌సింకి: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్‌ కంట్రీ)గా ఫిన్‌లాండ్‌ మరోసారి రికార్డుల్లోకెక్కింది. ఫిన్‌లాండ్‌ మూడోసారి హ్యాపీయెస్ట్‌ కంట్రీగా రికార్డు నమోదు చేసిందని ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటనలో వెల్లడించింది.

వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ రిపోర్టు పరిశోధకులు సుమారు 156 దేశాలకు చెందిన వారి జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ నిర్దారణకు వచ్చారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాలు ఫిన్‌లాండ్‌ వాసులు సంతోకరంగా ఉండటంతో కీలకంగా వ్యవహరించినట్లు పరిశోధనలో వెల్లడైందట. న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా వంటి దేశాలను వెనక్కి నెడుతూ..ఫిన్‌లాండ్‌ మరోసారి ఈ జాబితాలో చోటు సంపాదించింది. 

ఫిన్‌లాండ్‌లో ఉండే విస్తారమైన అడవులు, వేల సంఖ్యలో సరస్సులు అక్కడి వాసులు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా ఉపకరించాయట. ఇక జింబాబ్వే, సౌత్‌ సూడాన్‌, అప్గనిస్తాన్‌ ప్రపంచలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. logo
>>>>>>