శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 21, 2020 , 22:50:17

ప్రపంచంలోనే సంతోషకర దేశంగా ఫిన్‌లాండ్‌

ప్రపంచంలోనే సంతోషకర దేశంగా ఫిన్‌లాండ్‌

న్యూయార్క్‌: ప్రపంచంలోనే సంతోషకర దేశంగా ఫిన్‌లాండ్‌ మరోసారి నిలిచింది. ఐక్య రాజ్య సమితి (ఐరాస) సర్వే నివేదికలో వరుసగా మూడోసారి తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నది. తర్వాత స్థానాల్లో డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రియా నిలిచాయి. లక్సెంబర్గ్‌ తొలిసారి టాప్‌ పదిలో స్థానం దక్కించుకుని పదో ర్యాంకులో ఉన్నది. మరోవైపు సంతోషకర సూచీలో భారత్‌ ర్యాంకు పొరుగు దేశాల కన్నా దారుణంగా ఉన్నది. నేపాల్‌ 15, పాకిస్థాన్‌ 29, బంగ్లాదేశ్‌ 107, శ్రీలంక 130వ ర్యాంకుల్లో ఉండగా భారత్‌ 144వ ర్యాంకులో నిలిచింది. ఐరాస పరిశోధకులు 153 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ సమాచారం గత రెండేండ్లలో సేకరించినది కావడంతో ప్రస్త్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా ఆందోళన ప్రభావం ఈ నివేదికపై లేదన్నారు.


logo