శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 13:39:00

మే 13 వ‌ర‌కు ఆంక్ష‌ల‌ను పొడిగించిన ఫిన్‌ల్యాండ్‌

 మే 13 వ‌ర‌కు ఆంక్ష‌ల‌ను పొడిగించిన ఫిన్‌ల్యాండ్‌


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఫిన్‌ల్యాండ్ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది.  ప్ర‌స్తుతం ఉన్న స‌రిహ‌ద్దు ఆంక్ష‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది. మే 13 వ‌ర‌కు ట్రావెల్ ఆంక్ష‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది.  దేశంలోని రావ‌డం కానీ, దేశం నుంచి బ‌య‌ట‌కు పోవ‌డం కానీ ఉండ‌ద‌ని ఫిన్‌ల్యాండ్ పేర్కొన్న‌ది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఈ చ‌ర్య త‌ప్ప‌ద‌న్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. స్వీడెన్‌, నార్వేతో ఉన్న స‌రిహ‌ద్దుల వ‌ద్ద జ‌న సంచారాన్ని పూర్తిగా నిలిపివేయాల‌నుకుంటున్న‌ట్లు ఆ దేశం వెల్ల‌డించింది.  ఫిన్‌ల్యాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2176 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 27 మంది మ‌ర‌ణించారు. స్వీడెన్‌లో 477 మంది ప్రాణాలు కోల్పోయారు. logo