శనివారం 30 మే 2020
International - May 03, 2020 , 12:09:24

రెండు కొరియా దేశాల మ‌ధ్య కాల్పులు

రెండు కొరియా దేశాల మ‌ధ్య కాల్పులు

ఉత్త‌ర కొరియా, ద‌క్షిణ కొరియా దేశాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఐదేండ్ల త‌రువాత ఇరు దేశాల మ‌ధ్య ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చియోర్వాన్‌లోని రెండు దేశాల స‌రిహ‌ద్దుల్లో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ఉల్లంఘిస్తూ..ఇరు దేశాల జ‌వాన్లు కాల్పులు జ‌రుపుకున్నారు. ఈ కాల్పుల్లో దక్షిణ కొరియా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ మిలిటరీ తెలిపింది. మొదట ఉత్తరకొరియానే కాల్పులు జరపగా, అందుకు ప్రతిగా కాల్పులు జరిపామని దక్షిణ కొరియా వెల్ల‌డించింది. తాము రెండు రౌండ్లు కాల్పులు జరిపి ఉత్తరకొరియాకు హెచ్చరిక చేశామని ప్రకటించింది. ఈ కాల్పుల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే కాల్పుల‌కు కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు. అటు కాల్పుల ఘటనతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. logo