బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 06, 2020 , 02:05:10

మగతోడు లేకుండా పిల్లలు

మగతోడు లేకుండా పిల్లలు
  • అమెరికా జూలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సరీసృపం

వాషింగ్టన్‌: పురుష జీవితో సంపర్కం లేకుండానే బల్లి జాతికి చెందిన ఓ సరీసృపం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన అమెరికాలో టెనెస్సీలోని చట్టానూగా జూలో చోటు చేసుకున్నది. ‘చార్లీ’ అనే ఓ కొమోడో డ్రాగన్‌(బల్లి జాతికి చెందిన సరీసృపం) జూలో గత కొంతకాలంగా ఉంటుంది. సంతానాన్ని వృద్ధి చేసే ఉద్దేశంతో చార్లీ ఎన్‌క్లోజర్‌లోకి ఓ మగ కొమోడో డ్రాగన్‌ను జూ సిబ్బంది ఉంచారు. అయితే, ఆ పురుష జీవితో సంపర్కంలో పాల్గొనేందుకు చార్లీ ఆసక్తి కనబర్చలేదు. అయినప్పటికీ, చార్లీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన సిబ్బంది చార్లీ డీఎన్‌ఏను పరీక్షించారు. అయితే, అందులో మగ జీవితో సంపర్కం జరుపుకోకుండానే చార్లీకి ముగ్గురు పిల్లలు కలిగారని తేలింది. అయితే మగ జీవి తోడు లేకుండా పిల్లల్ని కనడం కొన్ని అకశేరుకాల్లో సాధారణమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. 


logo