మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 18:10:34

ప్లాస్మా చికిత్సకు అత్యవసర ఆమోదంపై ఎటూతేల్చని ఎఫ్‌డీఏ!

ప్లాస్మా చికిత్సకు అత్యవసర ఆమోదంపై ఎటూతేల్చని ఎఫ్‌డీఏ!

వాషింగ్టన్‌: కొవిడ్‌-19తో బాధపడుతున్న వారికి ఇప్పుడున్నది ప్లాస్మా చికిత్స ఒక్కటే. అయితే, ప్లాస్మా చికిత్సకు అత్యవసర ఆమోదాన్ని యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌  అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) హోల్డ్‌లో పెట్టింది.  అమెరికాలోని అంటువ్యాధుల ప్రముఖ నిపుణుడు ఆంథోనీ ఫౌసీతో సహా ఉన్నత సమాఖ్య ఆరోగ్య అధికారుల బృందం చికిత్సపై ఉద్భవిస్తున్న డేటా చాలా బలహీనంగా ఉందని వాదించారు. అయితే, సమీప భవిష్యత్తులో అత్యవసర ఆమోదం పొందే అవకాశముందన్నారు.

‘పాలసీ ప్రకారం, స్వస్థమైన ప్లాస్మా కోసం అత్యవసర వినియోగ అధికారం గురించి మేం ఏమైనా చర్యలు తీసుకుంటామా? లేదా? అనే దానిపై మేము వ్యాఖ్యానించలేం’ అని ఎఫ్‌డీఏ తెలిపింది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీస్‌ ఉంటాయి. వీరి నుంచి ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్‌ రోగులలో ప్రవేశపెడుతున్నారు. దీనినే ప్లాస్మా చికిత్స అని పిలుస్తున్నారు. కాగా,  ఎఫ్‌డీఏ అత్యవసర ప్లాస్మా చికిత్సకు అనుమతిస్తే మహమ్మారి నుంచి చాలామందిని కాపాడవచ్చని అమెరికాలోని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo