శనివారం 30 మే 2020
International - Apr 25, 2020 , 21:24:56

హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ఎఫ్‌డీఏ సూచ‌న‌లు

 హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ఎఫ్‌డీఏ సూచ‌న‌లు

వాషింగ్ట‌న్: క‌రోనా చికిత్స‌కు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ సూచించే ముందు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు డాక్ట‌ర్స్ అల‌ర్ట్‌గా ఉండాల‌ని పేర్కొంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా గుండెపై తీవ్ర ప్ర‌భావం ఉంటద‌ని పేర్కొంది. గుండె అపసవ్యంగా కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు దీనిని వాడటం వలన కనిపిస్తాయని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వాలని తెలిపింది. ఒక వేళ దీనిని వాడినా.. వైద్యులు రోగి ఆరోగ్యస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపింది. అయితే  హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్ర‌త్యామ్నాయం మాత్ర‌మేన‌ని త‌ప్ప‌నిస‌రి కాద‌ని చెప్పింది.


logo