శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 19:54:28

కొవిడ్‌ టీకా వచ్చినా.. వందశాతం పనిచేయదు..!: అమెరికన్‌ ఎక్స్‌పర్ట్‌ ఫౌసీ

కొవిడ్‌ టీకా వచ్చినా.. వందశాతం పనిచేయదు..!: అమెరికన్‌ ఎక్స్‌పర్ట్‌ ఫౌసీ

వాషింగ్టన్‌: ప్రపంచం మొత్తం టీకా కోసం ఎదురుచూస్తున్న వేళ ఓ ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టారు యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ. కొవిడ్‌ టీకా వచ్చినా అది 50-60% మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ మహమ్మారిని అదుపులో ఉంచేందుకు ఇంకా ప్రజారోగ్య చర్యలు అవసరమవుతాయని స్పష్టం చేశారు.  

‘టీకా సమర్థత ఏమిటో మాకు ఇంకా తెలియదు. ఇది 50% లేదా 60% పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఇది 75% కంటే ఎక్కువ పనిచేయాలని కోరుకుంటున్నాం.’ అని బ్రౌన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వెబ్‌నార్‌లో ఫౌసీ చెప్పారు . కానీ, టీకా 98% ప్రభావవంతంగా పనిచేస్తే అది చాలా గొప్ప విషయమని అన్నారు. ఏది ఏమైనా మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడడం, సామాజిక దూరాన్ని పాటించడంలాంటివి కొనసాగించాలని సూచించారు. మోడెర్నా ఇంక్  కొవిడ్‌-19 వ్యాక్సిన్ అధ్యయనాలు ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబరులో ఖచ్చితమైన డేటాను ఇవ్వగలవని  ఫౌసీ చెప్పారు. 2021 ప్రారంభంలో పదిలక్షల వ్యాక్సిన్ మోతాదులు, ఆ సంవత్సరం చివరినాటికి ఒక బిలియన్ డోసులు లభిస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo