బుధవారం 03 జూన్ 2020
International - Apr 26, 2020 , 15:51:23

13 మంది పిల్ల‌ల తండ్రికి.. క‌రోనా పాజిటివ్‌

13 మంది పిల్ల‌ల తండ్రికి.. క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్‌: స‌్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఓ వ్య‌క్తిగా న‌ర్సుగా ప‌నిచేస్తున్నాడు.  అత‌ని పేరు రాయ్ హ‌న్‌.  13 మంది పిల్ల‌లకు తండ్రి అయిన అతనికి కరోనా వైర‌స్ సోకింది. స్కాట్‌లాండ్‌లో హ‌న్ ఫ్యామిలీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. డుండీలో అతిపెద్ద కుటుంబంగా వారిని గుర్తిస్తారు.  నైన్‌వెల్స్‌ హాస్పిటల్‌లో రాయ్ న‌ర్సుగా ప‌నిచేస్తున్నాడు.  క‌రోనా వ్యాధిగ్ర‌స్తుల‌కు ఆయ‌న చికిత్స అందిస్తున్నాడు. అయితే ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ ధ‌రించి చికిత్స అందించినా.. అత‌నికి స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దాంతో అత‌ను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. ఆ ప‌రీక్ష‌లో అత‌ను పాజిటివ్‌గా తేలాడు.  హ‌న్ ప్ర‌స్తుతం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో  ఉన్నాడు. రాయ్ హ‌న్‌తో పాటు అత‌ని ఇంట్లో ఇప్పుడు ప‌ది మంది పిల్లలు ఉన్నారు.  హ‌న్ పిల్ల‌ల వ‌య‌సు అయిదేళ్ల నుంచి 28 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. 


logo