బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 18:39:55

చైనాలో అత్యంత వేగంగా నడిచే మెట్రో రైల్ ప్రారంభం

చైనాలో అత్యంత వేగంగా నడిచే మెట్రో రైల్ ప్రారంభం

బీజింగ్ : డ్రాగన్ కంట్రీ లో అత్యంత వేంగంగా నడిచే మెట్రో రైల్ పట్టాలెక్కింది. గంటకు 160 కిలోమీటర్లు ప్రయాణించే ఫాస్టెస్ట్ మెట్రోరైలు శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సబ్వే రైలు గువాంగ్జౌలోని 18, 20 నెంబర్ మెట్రో లైన్లలో సేవలు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇది ప్రారంభమైతే నాన్షా ఫ్రీ ట్రేడ్ జోన్ నుంచి సౌత్ గువాంగ్జౌ రైల్వే స్టేషన్, ఈస్ట్ గువాంగ్జౌ రైల్వే స్టేషన్లకు వరుసగా 25, 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. భవిషత్తులో గాంగ్‌డాంగ్‌లోని ఝుహై, ఝోన్హాన్, డాంగువాన్ నగరాలకు కూడా ఈ రెండు లైన్లను విస్తరించనున్నారు. సీఆర్ఆర్‌సీ నుంచి 18, 22 నెంబర్ లైన్లలో నడిపేందుకు గువాంగ్జౌ రైల్వే మొత్తం 40 రైళ్లను ఆర్డర్ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo