సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 17:23:32

హెలికాఫ్ట‌ర్‌లో ఆవు.. వెల‌క‌ట్ట‌లేని రైతు ప్రేమ‌!

హెలికాఫ్ట‌ర్‌లో ఆవు.. వెల‌క‌ట్ట‌లేని రైతు ప్రేమ‌!

స్విట్జర్లాండ్‌లోని ఒక రైతు గాయపడిన ఆవును విమానంలో తీసుకెళ్లాడు. స్విస్ ఆల్ప్స్‌లోని ఒక ప‌ర్వ‌తం నుంచి ఆవును హెలికాఫ్ట్‌లో తీసుకెళ్లాడు. ఎందుకంటే ఆవు క‌ద‌ల్లేని ప‌రిస్థితి. వేరే విధంగా ప్ర‌యాణించాలంటే ఆవు ప్రాణాల‌కే ప్ర‌మాదం అని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆవును తాళ్ల‌తో క‌ట్టి హెలికాఫ్ట‌ర్‌కు వేలాడ‌దీశారు. దీన్ని చూస్తున్న‌ప్పుడు ఆవు గాల్లో ఎగురుతున్న‌ట్లే క‌నిపిస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఈ క్లిప్‌ను ఏబీసీ న్యూస్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆవు గ‌మ్యానికి చేరుకోగానే కొంత‌మంది వ‌చ్చి దానికి నిదానంగా దింపారు. ఆవు గురించి ఇంత శ్ర‌ద్ధ వ‌హించినందుకు నెటిజ‌న్లు రైతును పొగడ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. 


logo