మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 19:28:54

విమానాశ్ర‌యంలో వ్య‌వ‌సాయం చేస్తున్న రైతు.. 12 కోట్లు ఇస్తామ‌న్నా నిరాక‌రించాడు!

విమానాశ్ర‌యంలో వ్య‌వ‌సాయం చేస్తున్న రైతు.. 12 కోట్లు ఇస్తామ‌న్నా నిరాక‌రించాడు!

త‌ల్లిదండ్రులు వ్య‌వ‌సాయం చేసి పిల్ల‌ల‌ను చ‌దివిస్తారు. పిల్ల‌లు ఇక సిటీల్లోనే ఉద్యోగం చేసుకుంటూ అక్క‌డే స్థిర‌ప‌డిపోతారు. ఊర్లో ఉన్న పొలాల‌ను రిలేటివ్స్‌కు కౌలుకిస్తుంటారు. లేదు ఆ పొలానికి బాగా డిమాండ్ ఉందంటే పొలాన్ని వారి చేతిలో పెట్టి క్యాష్‌ను వీరి చేతుల్లోకి తీసుకుంటారు. అంతే అంత‌టితో ఆ పొలంతో ఇక రుణం తీరిపోయిన‌ట్లే. వ్య‌వ‌సాయ కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ రైతులు పొలానికి ఇచ్చే విలువ ఇది. కానీ ఈ రైతు అలా చేయ‌లేదు. మూడు త‌రాలు కూర్చొని తినే సిరిసంప‌ద‌లు ఇస్తామ‌న్నా దిగ‌జారిపోలేదు. ఆ నేల‌త‌ల్లి క‌న్న‌తల్లి క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంటున్నాడు. చుట్టూ విమానాల శ‌బ్దాలు, అధికారుల‌కు భ‌య‌ప‌డ‌కుండా విమానాశ్ర‌యం మ‌ధ్య‌లో పొలం దున్నుతున్నాడు.

జపాన్‌లోనే రెండో అదిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా న‌రితా ఎయిర్‌పోర్టుకు పేరుంది. కొన్ని ల‌క్ష‌ల మంది ఈ విమానాశ్ర‌యం నుంచి ప్ర‌యాణం చేస్తారు. 1970లోనే ప్రభుత్వం నరితా విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది. దీనికోసం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు భారీగా ప‌రిహారం అందించి త‌మ భూముల‌ను సొంతం చేసుకున్నారు. కానీ అక్క‌డ నివ‌సించే ట‌కావో షిటో అనే రైతు పొలం మాత్రం తీసుకోలేక పోతున్నారు అధికారులు. అత‌నికి ఇవ్వ‌ని ఆస్తిలే‌దు, నిధులు లేవు. వేటికీ లొంగ‌ని రైతు ఆయ‌న‌. ఈ స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు. ట‌కోవా తండ్రి కాలం నుంచి అధికారుల‌తో పోరు న‌డుస్తుంది. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తుంటే ట‌కోవా ఉద్యోగం చేస్తుండేవాడు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న వార‌స‌త్వాన్ని ట‌కోవా తీసుకున్నాడు. విమానాశ్ర‌య నిర్మాణానికి ఆ పొలం కోసం రూ.12,67,39,329 ఆఫ‌ర్ చేసినా నిరాక‌రించాడు. ఈ నేల త‌రువాత త‌రాల‌కు చెందాలే కాని ఇనుప చ‌క్రాల కింద న‌లిగిపోకూడ‌ద‌ని ప‌ట్టుప‌ట్టుకు కూర్చున్నాడు ట‌కోవా.

అధికారులు త‌లుచుకుంటే ఇత‌నెంత అనుకుంటారేమో.. కేసులు, కోర్టులు అన్ని ప‌నులు అయ్యాయి. చివ‌రికి కోర్టు కూడా ట‌కోవాకే మ‌ద్ద‌తు ప‌లికింది. ఎందుకంటే ఇత‌నికి స్టూడెంట్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. జపాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు టకావో గురించి తెలుసుకుని ఆయనకు మద్దతుగా ఉద్యమిస్తున్నారు. ఇత‌ను పండించే కూర‌గాయ‌లు చుట్టుప‌క్కలున్న 400 మంది క‌స్ట‌మ‌ర్ల‌కు పంపిణీ చేస్తుంటారు. అధికారుల‌ను లెక్క‌చేయ‌కుండా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు ట‌కోవా. logo