గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 16:55:06

బాత్రూంలో మహారాణి అద్దం .. విలువ తెలుసుకొని షాక్‌!

బాత్రూంలో మహారాణి అద్దం .. విలువ తెలుసుకొని షాక్‌!

పారిస్‌: మనం బాత్రూంలో వాడే అద్దం ఓ మహారాణి వాడిందని తెలిస్తే..? దాని విలువ 8000పౌండ్లు (దాదాపు 8 లక్షలు) అని తెలిస్తే? షాక్‌ అవ్వకుండా ఉంటామా? ఇలాంటి పరిస్థితే ఫ్రాన్స్‌లో ఓ కుటుంబానికి ఎదురైంది. వారు తమ బాత్రూంలో వాడే మిర్రర్‌ విలువ తెలుసుకొని అంతా ఆశ్చర్యపోయారు. ఆ అద్దం ఫ్రాన్స్‌ చివరి రాణి మేరీ ఆంటోనిట్టెకు చెందినదని తెలుసుకున్న ఆ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. 

ఫ్రాన్స్‌లోని ఓ కుటుంబం తమ బాత్రూంలో ఓ అద్దాన్ని 40 ఏళ్లుగా వాడుతోంది. మొదట దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అది  19 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉంది. ఇప్పుడది యూకేలోని బ్రిస్టల్‌లో జరిగిన వేలంలో కనీసం 8,000 పౌండ్లకు అమ్ముడుపోతుందని భావిస్తున్నారు.

ఆ అద్దం ఇంట్లోకి ఎలా వచ్చిందంటే..?

పురాతన 18వ శతాబ్దపు ఫ్రెంచ్ మిర్రర్ గ్లాస్ 19 వ శతాబ్దం తరువాత చక్కటి వాల్నట్ చెక్కిన చట్రంలో అమర్చబడింది. వెండి ఫ్రేమ్‌లో అమర్చిన ఈ గ్లాస్ నెపోలియన్ III భార్య, ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని, ఆమె మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి అనేక వస్తువులను కొనుగోలు చేసిందని భావిస్తున్నారు. ఫాక్స్ న్యూస్ ప్రకారం, ఒక కుటుంబ సభ్యుడు వారి అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందాడు. దాని నిజమైన విలువను గ్రహించకుండా వారి బాత్రూంలో వేలాడదీశాడు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి, లూయిస్ XVIను వివాహం చేసుకుంది. ఆమె 1774, 1792 మధ్య పాలించింది. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.