ఆదివారం 31 మే 2020
International - Apr 14, 2020 , 13:13:00

మీ వద్ద ఉన్నది ఇవ్వండి.. కావల్సింది తీసుకోండి

మీ వద్ద ఉన్నది ఇవ్వండి.. కావల్సింది తీసుకోండి

 ప్రస్తుతం లాక్‌డౌన్‌ టైం.. నిత్యావసర వస్తువులు చాలామందికి దొరకడం లేదు. షాపులు, తయారీ యూనిట్లు మూతపడటంతో ఇబ్బందిగా మారింది. అయితే.. యూఎస్‌లోని విస్కాన్‌సిన్‌కు చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. ఫ్రీ ప్యాంట్రీ పేరుతో ఓక షాపు ఓపెన్ చేసింది. అది కూడా ఇంటి ముందు పెర‌ట్లోనే. దీని కాన్సెప్ట్‌ ఎంటి అంటే.. ఎవరి వద్దయినా అదనంగా ఉండే వస్తువులను ఇక్కడ పెట్టొచ్చు. ఇక్కడ ఉన్న వస్తువుల్లో అవసరమైనవి తీసెకెళ్లొచ్చు.  ఇంట్లోకి అవ‌స‌ర‌మ‌య్యే చాలా వ‌స్తువుల‌ను అందులో పొంద‌బ‌రిచారు. ఆ షాపు ముందు 'share if you can spare', 'please take what you need'అనే బోర్డు పెట్టారు.   క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకోవ‌డ‌మే మాన‌వ‌త్వం   అంటున్నారు దీని నిర్వాహకులు. ఫ్రీ ప్యాంట్రీ చిత్రాన్ని టెర్రీ ఉరిబ్ గాల్ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక్క‌డ పుస్త‌కాలు కూడా ఉన్నాయి. క్వారెంటైన్‌లో బాగా కాల‌క్షేపం అవుతుంది అంటున్న‌ది.


logo