బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 07:27:33

ఆఫ్ఘన్‌ను వీడుతున్న సిక్కులు, హిందువులు.. ఐఎస్‌ బెదిరింపులే కారణం

ఆఫ్ఘన్‌ను వీడుతున్న సిక్కులు, హిందువులు.. ఐఎస్‌ బెదిరింపులే కారణం

కాబూల్‌ : ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో సిక్కులు, హిందువులపై రోజురోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. వీరిని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) మద్దతుదారులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీంతో సిక్కులు, హిందువులు తమ జన్మస్థలాలను వదిలి వేరే చోటికి వలస వెళ్తున్నారు. ఆఫ్ఘన్‌లో ముస్లింల ప్రాబల్యం కారణంగా సిక్కులు, హిందువులు చాలా ఏండ్లుగా వివక్షకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరిపై దాడులు సైతం జరుగుతున్నాయి. హమ్‌దర్ద్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన కుటుంబానికి చెందిన ఏడుగురిని ఐఎస్‌ ఉగ్రవాదులు చంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండలేకపోతున్నానని భయాందోళన వ్యక్తం చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo